SS Rajamouli valuable suggestion to Nani , his team for Regular Franchise of HIT

Tuesday,November 29,2022 - 12:38 by Z_CLU

SS Rajamouli to request Nani , his team for Regular Franchise

నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిరనేని నిర్మాతగా అడివి శేష్ హీరోగా తెరకెక్కిన 'HIT2'డిసెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ అందుకున్న రాజమౌళి ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అమెరికా పర్యటన ముగించుకొని రోజే ఈవెంట్ కి రావడంతో రాజమౌళి పై నాని పొగడ్తల వర్షం కురిపించాడు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ నాని అండ్ టీం కి ఓ రిక్వెస్ట్ చేశారు. ఫ్రాంచైజ్ చేయడం మాములు విషయం కాదు. చాలా టఫ్. హిట్ ఫ్రాంచైజ్ నుండి వచ్చే సిరీస్ కి మంచి క్రేజ్ ఉంది. హీరో ఎవరైనా హిట్ సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారని అర్థమవుతుంది.

ప్రతీ ఏడాది ఒకే సీజన్ లో హిట్ సిరీస్ నుండి సినిమా వస్తే బాగుంటుంది. నాని, టీం ఇలా ప్లాన్ చేస్తే బాగుంటుందని రాజమౌళి స్పెషల్ గా రిక్వెస్ట్ చేశారు. మరి జక్కన్న ఇచ్చిన ఈ సజిషణ్ హిట్ టీం తీసుకొని వచ్చే ఏడాది నుండి డిసెంబర్ లో ఇదే డేట్ కి హిట్3 ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా ? చూడాలి.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics