Sridevi Soda Center Movie has cleared all censor formalities

Wednesday,August 25,2021 - 07:29 by Z_CLU

పక్కా ప్లానింగ్ తో వస్తోంది శ్రీదేవి సోడా సెంటర్ సినిమా. కాస్త ముందుగానే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. దాని కంటే ముందే ట్రయిలర్ రిలీజ్ చేశారు. దశలవారీగా సాంగ్స్ రిలీజ్ కార్యక్రమం నడుస్తోంది. మరోవైపు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్రచారం కూడా ప్రారంభమైంది. ఇప్పుడు చివరి స్టెప్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తిచేశారు.

శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు సెన్సార్ అధికారులు లైన్ క్లియర్ చేశారు. ఎలాంటి కట్స్ లేకుండా U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు ఉంది. సెన్సార్ క్లియర్ అవ్వడంతో మేకర్స్ తమ ప్రచారాన్ని మరింత పెంచారు. మరోవైపు ఆన్ లైన్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 27న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అటు ఓవర్సీస్ లో 26నే ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయి.

Sridevi Soda Center Trailer

ప్రస్తుతం ఈ సినిమా చుట్టూ చాలా బజ్ నడుస్తోంది. దీనికి ఒక కారణం మణిశర్మ కంపోజ్ చేసిన పాటలు హిట్టవ్వడం అయితే, రెండో రీజన్ ట్రయిలర్ పెద్ద సక్సెస్ అవ్వడం. ఇలా కంప్లీట్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో గ్రాండ్ గా ఈనెల 27న థియేటర్లలోకి వస్తోంది శ్రీదేవి సోడా సెంటర్.

Sridevi Soda Center - చుక్కల మేళం సాంగ్

పలాస ఫేమ్ కరుణ కుమార్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో సుధీర్ బాబు సరనస ఆనంది హీరోయిన్ గా నటించింది. సుధీర్ బాబు ఇందులో సూరిబాబు పాత్రలో, ఆనంది సోడాల శ్రీదేవి పాత్రలో కనిపించబోతున్నారు. గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమా, సుధీర్ కెరీర్ ను మలుపు తిప్పుతుందనే అంచనాలున్నాయి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics