Sreeleela daughter of Balayya in NBK108

Monday,May 23,2022 - 03:33 by Z_CLU

Sreeleela daughter of Balayya in NBK108 ?

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్న నందమూరి బాలయ్య నెక్స్ట్ ఎంటర్టైన్ మెంట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ కాంబో సినిమా మీద అటు బాలయ్య అభిమానుల్లో ఇటు మూవీ లవర్స్ లో మంచి అంచనాలున్నాయి.

ఈ సినిమా ఎలా ఉండబోతుంది ? బాలయ్య ని అనీల్ ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడు ? అనే క్వశ్చన్స్ ఉన్నాయి. వీటన్నిటికి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇచ్చాడు అనిల్ రావిపూడి.

 "నా సినిమాలో ఆయన చాలా డిఫరెంట్ గా కనిపించనున్నారు.  బాలయ్య 40 ప్లస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. తండ్రి కూతురు కథతో తెరకెక్కనున్న ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. బాలయ్యకి కూతురుగా హీరోయిన్ శ్రీ లీల చేయబోతుంది. బాలయ్య కేరెక్టర్ డ్రైవ్ తో నడిచే సినిమా ఇది. 'పోకిరి', 'గబ్బర్ సింగ్', 'అర్జున్ రెడ్డి' సినిమాల్లో లాగ హీరో కేరెక్టరైజేషన్ తో ఆ టెంప్లెట్ లో సినిమా చేయబోతున్నాను. మాస్ ఆయన స్ట్రెంగ్త్ దాన్ని దృష్టిలో పెట్టుకొని యాక్షన్  డిజైన్ చేసుకున్నాం.  కచ్చితంగా సరికొత్త బాలయ్య ని చూస్తారు. " అంటూ NBK108 డీటెయిల్స్ చెప్పి బాలయ్య ఫ్యాన్స్ ని ఖుషి చేశాడు అనీల్ రావిపూడి.

ప్రస్తుతం అనీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన F3 ఈ నెల 27న థియేటర్స్ లోకి రానుంది. బాలయ్య గోపీచంద్ సినిమాతో బిజీగా ఉన్నాడు. జులై లో ఈ ఇద్దరి కాంబో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

  * Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics