Sreekaram 1st weekend collection

Monday,March 15,2021 - 04:03 by Z_CLU

శర్వానంద్ హీరోగా నటించిన శ్రీకారం సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. కానీ వీకెండ్ గడిచేసరికి ఈ మూవీకి వసూళ్లు తగ్గాయి. ఫస్ట్ వీకెండ్ (4 రోజులు) ఈ సినిమాకు 8 కోట్ల 30 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

వ్యవసాయం కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు వసూళ్లు కాస్త తక్కువగానే వస్తున్నప్పటికీ.. అవి నిలకడగా ఉన్నాయి. ఈ వీకెండ్ కూడా శ్రీకారం ఇలానే పెర్ఫార్మ్ చేస్తే సినిమా బ్రేక్ ఈవెన్ అయి లాభాల బాట పడుతుంది.

ఏపీ, నైజాం 4 రోజుల వసూళ్లు (షేర్) నైజాం - రూ. 1.98 కోట్లు సీడెడ్ - రూ. 1.50 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 1.05 కోట్లు ఈస్ట్ - రూ. 0.73 కోట్లు వెస్ట్ - రూ. 0.45 కోట్లు గుంటూరు - రూ. 0.92 కోట్లు నెల్లూరు - రూ. 0.35 కోట్లు కృష్ణా - రూ. 0.46 కోట్లు