Sree Vishnu’s ‘Alluri’ Trailer Review

Saturday,September 17,2022 - 01:13 by Z_CLU

ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ 'అల్లూరి'. ఈ సినిమాతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న  గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు. తనికెళ్ల భరణి ఒక యువకుడి చెప్పే స్ఫూర్తిదాయకమైన మాటలతో ట్రైలర్ ప్రారంభమైయింది. ఆ తర్వాత శ్రీవిష్ణు నేరస్తులను అదుపు చేయడంలో తనకంటూ ఓ స్పెషల్ స్టయిల్ ఉన్న పోలీస్ ఆఫీసర్ అల్లూరిగా పరిచమయ్యారు. కేసులను డీల్ చేయడానికి వేరే మార్గం లేనప్పుడు అతను వైలెంట్ గా మారుతాడు. నక్సలైట్లు, నేరస్తుల్లో మార్పు తీసుకువస్తాడు. కానీ అతను అధిగమించడానికి ఇంకా పెద్ద అడ్డంకులు వుంటాయి. పోలీస్ ఉద్యోగం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేస్తాడు అల్లూరి స్పూర్తిదాయకమైన ప్రయాణం ట్రైలర్ లో బ్రిలియంట్ గా ప్రజంట్ చేశారు. శ్రీవిష్ణు అద్భుతమైన నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శ్రీవిష్ణు భార్యగా కయదు లోహర్ తన పాత్రను చక్కగా పోషించింది. ప్రదీప్ వర్మ తన రైటింగ్, టేకింగ్‌తో మంచి ఇంప్రెషన్‌ని కలిగించాడు. రాజ్ తోట కెమెరా పనితనం చక్కగా ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం పవర్ ఫుల్ గా వుంది. అల్లూరి గ్రిప్పింగ్ పోలీస్ డ్రామాగా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది.

*Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics