Sree Leela in Ashish’s Selfish Movie

Thursday,January 27,2022 - 08:04 by Z_CLU

ఇటివలే RowdyBoys సినిమాతో హీరోగా ఎంట్రీగా ఇచ్చిన ఆశిష్ త్వరలోనే రెండో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు - సుకుమార్ కంబైన్ గా నిర్మించనున్న ఈ సినిమాకు స్క్రిప్ట్ లాక్ అయింది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు Selfish అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆశిష్ సరసన హీరోయిన్ గా శ్రీ లీల ని ఎంపిక చేశారు. 'పెళ్లి సందD' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ప్రస్తుతం రవితేజ 'ధమాకా' సినిమాలో నటిస్తుంది. మొదటి సినిమాకి యూత్ లో వచ్చిన క్రేజ్ తో శ్రీలీల ని ఆశిష్ రెండో సినిమాకు లాక్ చేశారు.

సినిమాకు సంబంధించి టెక్నీషియన్స్ ని కూడా ఫైనల్ చేశారు. మిక్కీ జె మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్న ఈ సినిమాకు మణికందన్ సినిమాటోగ్రఫీ గా వర్క్ చేయనున్నారు. తాజాగా సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టారు. సుకుమార్ నిర్మాణంతో పాటు సినిమాకు మాటలు కూడా అందించనుండటం మరో విశేషం. ఆర్య తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి దిల్ రాజు -సుకుమార్ పేర్లు స్క్రీన్ పై కనిపించనున్నాయి. ఈ సినిమాతో సుకుమార్ దగ్గర రంగస్థలం వరకూ పనిచేసిన ఆయన శిష్యుడు కాశి విశాల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు

దిల్ రాజు ప్రొడక్షన్స్ , సుకుమార్ రైటింగ్స్ కలిస్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల గ్రాండ్ గా లాంచ్ అవ్వనుంది. మార్చ్ లేదా ఏప్రిల్ నుండి సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.