SR Kalyana Mandapam to release on August 6th

Tuesday,July 13,2021 - 01:09 by Z_CLU

రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకంపై ప్ర‌మోద్ - రాజు నిర్మాత‌లుగా.. నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెరకెక్కించిన సినిమా SR క‌ళ్యాణమండంపం. ఆగస్ట్ 6న సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సినిమా టైటిల్ ఎనౌన్స‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. దీనికితోడు రిలీజైన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్టవ్వడం సినిమాకు ప్లస్. చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార వంటి పాట‌లు యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇక టీజర్ అయితే ఇనిస్టెంట్ గా హిట్టయింది.

ఇటీవ‌లే SR క‌ళ్యాణమండంపం చిత్రాన్ని థియేట‌ర్లలో మాత్రమే విడుద‌ల చేస్తున్నామంటూ అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా అందుకు త‌గ్గ‌ట్లుగా నిర్మాత‌లు ప్ర‌మోద్ - రాజులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కొన్ని రోజుల కింద శంక‌ర్ పిక్చ‌ర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్నారు. ఇలా రిలీజ్ కు ముందే సినిమా రైట్స్ అన్నీ అమ్ముడుపోవడం మార్కెట్ ను ఆశ్చర్యపరిచింది.

SR Kalyana kiram abbavaram 4

ఇక ఈ సినిమాలో హీరోగా న‌టించ‌డ‌మే కాకుండా క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సైతం కిర‌ణ్ అబ్బ‌వ‌రం అందించ‌డం విశేషం. విల‌క్ష‌ణ న‌టుడు, డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న పాత్ర ఈ చిత్రానికి మెయిన్ ఎట్రాక్షన్ కానుంది. చేత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics