Special Thanks to ZEE Studios for Releasing it in theaters – Sai Tej

Friday,December 11,2020 - 03:00 by Z_CLU

కరోనా ఎఫెక్ట్ తో మూతపడిన థియేటర్స్ ఎట్టకేలకు తెరుచుకున్నాయి. ప్రస్తుతం పాత సినిమాలతో సందడి చేస్తున్న సినిమాలు ఇకపై కొత్త సినిమాలతో కళకళలాడబోతున్నాయి. కొత్త సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకుల ముందుకు క్రిస్మస్ నుండి రిలీజ్ కి రెడీ గా ఉన్న సినిమాలు రాబోతున్నాయి. ముందుగా 'Solo Brathuke So Better' సినిమా దీనికి నాంది పలకనుంది. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న Sai Tej హీరోగా నటించిన ఈ సినిమా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది. తాజాగా ఈ సినిమా నుండి టైటిల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసారు.

ఈ సందర్భంగా జరిగిన సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్ లో సాయి తేజ్ మాట్లాడుతూ " మా సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా జీ స్టూడియోస్ సంస్థను నా ధన్యవాదాలు. ముందుగా OTT రిలీజ్ అనుకున్నాం. ఆల్రెడీ రైట్స్ ఇచ్చేశాం. కానీ థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయని తెలిసి జీ టీంను రిక్వెస్ట్ చేసి వాళ్ళ ద్వారానే థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. సో దయచేసి థియేటర్స్ కి రండి మా సినిమాను చూసి ఆదరించి హిట్ చేయండి. ఇక ఆడియన్స్ కి కంఫర్ట్ అండ్ సేఫ్టీ ఇస్తూ సినిమా హాల్స్ ను రెడీ చేసిన థియేటర్స్ యాజమాన్యానికి థాంక్స్. అలాగే సినిమాలో మంచి స్విచువేషణ్ లో వచ్చే ఈ టైటిల్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమాకు మంచి ఆల్బం ఇచ్చిన తమన్ బంగారానికి అలాగే ఈ సాంగ్ కి గొప్ప సాహిత్యం అందించిన సీతారామ శాస్త్రి గారికి నా స్పెషల్ థాంక్స్" అన్నారు.