SP Balu faced difficulties with 2 Languages

Saturday,September 26,2020 - 12:54 by Z_CLU

తన గానంతో కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న SP Balu నిన్న మధ్యాహ్నం స్వర్గస్థులైన సంగతి తెలిసిందే. 16 భాషల్లో దాదాపు 40 వేలకు పైగా పాటలు పాడిన గాన గంధర్వుడికి రెండు భాషల్లో మాత్రం పాడటం కష్టమనిపించిందట. అవును... బెంగాలీ, ఒరియా భాషల్లో పదాలు పలకడం, పాడటం కాస్త ఇబ్బందిగా అనిపించేదట. ఈ విషయాన్ని ఆ మద్య ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకున్నారు బాలు.

అయితే ఏ భాషలో పాడినా దానిపై పూర్తి పట్టు తెచ్చుకున్నాకే గానం చేసానని తెలిపారు. ఇక బెంగాలి, ఒరియా పాటలు పాడటం కష్టమనిపించినందున ఆ భాషల్లో తక్కువ పాటలు పాడానని తెలిపారు. ఏదేమైనా తను చేసిన పని తనకి ఎప్పుడూ సంతృప్తినిచ్చేదని, లేదంటే ఇన్నేళ్ళు సింగర్ గా కొనసాగేవాడిని కానని, ఇంత మంది అభిమానాన్ని అందుకొనేవాడిని కాదని అన్నారు.