Solo Bratuke So Better Title song on tomorrow

Thursday,December 10,2020 - 04:05 by Z_CLU

Solo Brathuke So Better - ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజైన పాటలన్నీ సూపర్ డూపర్ హిట్టయ్యాయి. సూపర్ ఫామ్ మీద ఉన్న తమన్.. క్రేజీ ఆల్బమ్ అందించాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి మోస్ట్ ఎవెయిటింగ్ సాంగ్స్ ఇవి కాదు. అసలు పాట రేపు వస్తోంది.

సోలో బ్రతుకే సో బెటర్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నారు. సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ఇదే అంటోంది యూనిట్. తమన్ తన టాలెంట్ మొత్తం ఈ సాంగ్ లో చూపించాడట. ఈ పాటతో సినిమాపై హైప్ పీక్ స్టేజ్ కు వెళ్తుందని యూనిట్ కాన్ఫిడెంట్ గా చెబుతోంది.

solo_bratuke_so_better_movie_sai_dharam_tej

సాయి తేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్, జీ స్టూడియోతో కలిసి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలోకి రానుంది సోలో బ్రతుకే సో బెటర్.