Solo Brathuke So Better Streaming in Zee5

Monday,January 25,2021 - 12:33 by Z_CLU

లాక్ డౌన్ తర్వాత ఫస్ట్ హిట్ గా నిలిచిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చింది. రిపబ్లిక్ డే కానుకగా ఈ సినిమాను ఇవాళ్టి నుంచి zee5లో స్ట్రీమింగ్ కు పెట్టారు.

సాయి తేజ్ కథానాయకుడిగా నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాను జీ గ్రూప్ థియేటర్లలో విడుదల చేసింది. లాక్ డౌన్ తరువాత వెండితెరపై ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది. ఇప్పుడు డిజిటల్ తెర వీక్షకులకు వినోదాన్ని అందించడానికి ఇవాళ్టి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది.

Full Movie - Solo Brathuke So Better

సాయితేజ్, నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తమన్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. సత్య, వెన్నెల కిషోర్ కామెడీ హైలెట్ గా నిలిచింది.