Solo Brathuke So Better Shooting Completed

Friday,September 11,2020 - 01:27 by Z_CLU

సరిగ్గా కొన్ని రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడిన Solo Brathuke So Better సినిమా నిన్నటితో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటివలే చివరి షెడ్యుల్ మొదలు పెట్టిన యూనిట్ జెట్ స్పీడులో షూట్ ఫినిష్ చేసి సినిమాను రిలీజ్ కి రెడీ చేసారు. హైదరాబాద్ లో దాదాపు పది రోజుల పాటు జరిగిన ఈ షెడ్యుల్ తో టోటల్ షూట్ పూర్తి చేసారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి ధరం తేజ్ సరసన నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్ పై BVSN Prasad నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.