Solo Brathuke So better first Day Collection

Saturday,December 26,2020 - 06:17 by Z_CLU

రిలీజైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే హిట్ టాక్ తెచ్చుకుంది సోలో బ్రతుకే సో బెటర్ మూవీ. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫస్ట్ డే కలెక్షన్ రిపోర్ట్ వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు ఫస్ట్ డే 4.7 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇండియా వైడ్ చూసుకుంటే ఈ కలెక్షన్ మొత్తం 5.1 కోట్లు.

కరోనా తర్వాత థియేటర్లలోకి ఓ సినిమా వస్తే పరిస్థితేంటి? ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా? 50శాతం ఆక్యుపెన్సీతో సినిమాను రన్ చేయడం సాధ్యమేనా? లాంటి ఎన్నో అనుమానాలకు సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ఛెక్ పెట్టింది. వసూళ్లతో బంపర్ హిట్ అనిపించుకుంది.

ఏపీ, నైజాం ఫస్ట్ డే గ్రాస్ నైజాం - రూ. 1.84 కోట్లు సీడెడ్ - రూ. 0.86 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 0.57 కోట్లు గుంటూరు - రూ. 0.43 కోట్లు ఈస్ట్ - రూ. 0.34 కోట్లు వెస్ట్ - రూ. 0.25 కోట్లు కృష్ణా - రూ. 0.21 కోట్లు నెల్లూరు - రూ. 0.20 కోట్లు