Shruti Haasan to romance with Prabhas in Salaar ?

Wednesday,January 27,2021 - 03:50 by Z_CLU

ప్రభాస్ అప్ కమింగ్  క్రేజీ ప్రాజెక్ట్స్ లో 'సలార్' ఒకటి. KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ -ప్రభాస్ కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఎనౌన్స్ మెంట్ నుండే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. వచ్చే నెల నుండి సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తయింది. మరో పక్క ప్రభాస్ కి హీరోయిన్ ని ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు ప్రశాంత్.

మొన్నటి వరకు ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా కైత్రినా కైఫ్ , దిశా పఠాని పేర్లు వినిపించగా తాజాగా ఇప్పుడు శృతి హాసన్ లిస్టులో చేరింది. 'సలార్ బ్యూటీ' ఈమె అంటూ సోషల్ మీడియాలో శృతి పేరు చక్కర్లు కొడుతుంది. మేకర్స్ నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు కానీ... శృతి హాసన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ స్టేజిలో ఉందని అంటున్నారు. మరి ప్రభాస్ పక్కన ఈ పాన్ ఇండియా సినిమాలో నటించేది శృతినేనా ? లేక మరో హీరోయిన్ ఫైనల్ అవుతుందా ? అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.