Shruti Haasan in Balakrishna Gopichand Malineni Movie

Thursday,May 06,2021 - 04:54 by Z_CLU

ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో 'అఖండ' సినిమా చేస్తున్న బాలకృష్ణ.. క్రాక్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ మలినేని తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇటివలే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. తాజాగా బాలయ్య సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ని ఫైనల్ చేశారని తెలుస్తుంది.

shruti Haasan latest stills zeecinemalu

గోపీచంద్ డైరెక్షన్ లో 'బలుపు', 'క్రాక్' సినిమాల్లో నటించింది శృతి. ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ సాధించాయి. అందుకే తనకి కలిసొచ్చిన ఈ లక్కీ బ్యూటీని నెక్స్ట్ సినిమాకు కూడా రిపీట్ చేయబోతున్నాడట గోపీచంద్. అలాగే సినిమాలో హీరోయిన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. దర్శకుడితో పాటు మిగతా టీం కూడా శృతి ఆ రోల్ కి యాప్ట్ అని భావిస్తున్నారని ఇన్సైడ్ టాక్.

ఇంతవరకూ బాలయ్య తో శృతి హాసన్ సినిమా చేయలేదు. సో ఏ రకంగా చూసుకున్నా ఇది ఫ్రెష్ కాంబో అవుతుంది. అందుకే హీరోయిన్ గా ఈ భామనే ఫిక్స్ అయ్యారని అంటున్నారు.

'క్రాక్' తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ -ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న 'సలార్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆ సినిమా తర్వాత శృతి చేయబోయే సినిమా బాలయ్య దే అని సమాచారం. ప్రాజెక్ట్ ఎనౌన్స్ అయిన వెంటనే టైం చూసుకొని హీరోయిన్ గా శృతి కి వెల్కం చెప్పనున్నారు మేకర్స్. త్వరలోనే ఆ ప్రకటన రానుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది. మరి గోపీచంద్ డైరెక్షన్ లో బాలయ్య నటిస్తున్న ఈ సినిమాతో శృతి తెలుగులో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics