Shruthi Haasan gives clarity on ‘Vakeel Saab’ release!
Wednesday,November 25,2020 - 04:37 by Z_CLU
పవర్ స్టార్ Pawan Kalyan రీ ఎంట్రీ ఇస్తున్న 'వకీల్ సాబ్' సినిమా రిలీజ్ డేట్ ప్రకటన కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ 'పింక్' సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. దీంతో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు మేకర్స్. ఇటివలే మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టినప్పటికీ వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ ఉంటుందా లేదా అనేది ప్రశ్నగానే మిగిలింది.
అయితే తాజాగా 'Vakeel Saab' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చింది శృతి హాసన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను 'వకీల్ సాబ్' లో నటిస్తున్నట్లు ప్రకటించిన ఆమె జనవరి నుండి సినిమా షూట్ లో పాల్గొంటునట్లు తెలిపింది. దీంతో సినిమా జనవరిలో రిలీజ్ ఉండదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది.
సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. బోణీ కపూర్ సమర్పణలో దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.