Shriya to do a key role in Nithin’s Andhadhun Remake

Thursday,September 10,2020 - 01:36 by Z_CLU

కొన్ని రీమేక్ సినిమాల్లో ఒరిజినల్ లో కనిపించిన క్యారెక్టర్ ఎవరు చేస్తారా అనే ఆసక్తి నెలకొంటుంది. ప్రస్తుతం Nithin తెలుగులో చేస్తున్న 'Andhadhun' రీమేక్ పై కూడా ఇలాంటి ఆసక్తి నెలకొంటుంది. హిందీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాలో Tabu ముఖ్య పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు తెలుగులో ఆ పాత్రను ఎవరితో చేయిస్తారా అనే చర్చ నడుస్తుంది. ఇక లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆ క్యారెక్టర్ కు హీరోయిన్ Shriya ను ఫైనల్ చేసారట మేకర్స్. త్వరలోనే ఈ విషయాన్ని ఎనౌన్స్ చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం.

ఇటివలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మేర్లపాక గాంధి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ రీమేక్ ను Sresht Movies బ్యానర్ పై సుధాకర్ రెడ్డి , నిఖిత రెడ్డి నిర్మిస్తున్నారు.