Sharwanand Kishore Tirumala Movie Launch Details

Saturday,October 24,2020 - 01:57 by Z_CLU

ప్రస్తుతం Sharwanand చేతిలో 3 సినిమాలున్నాయి. అందులో ఒకటి Sreekaram కాగా , తెలుగు-తమిళ్ లో చేస్తున్న బైలింగ్వెల్ సినిమా ఇంకొకటి. ఈ రెండు కాకుండా, మహాసముద్రం కూడా ఉంది. వీటిలో రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే మరో సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు శర్వా. Kishore Tirumala దర్శకత్వంలో తదుపరి సినిమా చేయదానికి రెడీ అవుతున్నాడు. ఈ కాంబో సినిమా రేపు తిరుపతిలో లాంచ్ కానుంది.

ఇటివలే Ram Red సినిమాను డైరెక్ట్ చేసిన కిషోర్ తిరుమల తాజాగా శర్వానంద్ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసాడు. మార్చ్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పై Sudhakar Cherukuri ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఎండింగ్ లో సినిమాను విడుదల చేస్తారు.