Sharwanand in Kishore Tirumala Direction

Tuesday,September 29,2020 - 05:05 by Z_CLU

కొన్ని రోజుల కిందటి సంగతి.. వెంకటేష్ కోసం మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ రెడీ చేశాడు దర్శకుడు Kishore Tirumala. ఆడవాళ్లు మీకు జోహార్లు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల Venkatesh ఆ ప్రాజెక్ట్ టేకప్ చేయలేదు.

అలా సైడ్ ట్రాక్ లోకి వెళ్లిపోయిన ఈ ప్రాజెక్ట్ మళ్లీ హెడ్ లైన్స్ లోకి వచ్చింది. అయితే ఈసారి హీరో మారిపోయాడు.

అవును.. వెంకటేష్ చేయాలనుకున్న ఆ కథ ఇప్పుడు Sharwanand దగ్గరకొచ్చి ఆగింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా #AdavalluMeekuJoharlu ప్రాజెక్టు మెటీరియలైజ్ అయ్యే అవకాశాలున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ బయటకు వస్తాయి