ZeeCinemalu – June 3

Wednesday,June 02,2021 - 09:33 by Z_CLU

Rakhi-zeecinemalu-ntr

రాఖీ నటీనటులు : NTR, ఇలియానా, చార్మి ఇతర నటీనటులు : సుహాసిని, రవి వర్మ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : కృష్ణవంశీ ప్రొడ్యూసర్ : K.L. నారాయణ రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006 NTR, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాలో ఛార్మి నటన హైలెట్

========================== abcd-allu-sirish-zeecinemalu

ఏబీసీడీ నటీనటులు : అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్ ఇతర నటీనటులు : భరత్, నాగబాబు, రాజా, కోట శ్రీనివాస రావు, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : జుధా సాందీ డైరెక్టర్ : సంజీవ్ రెడ్డి ప్రొడ్యూసర్స్ : మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని రిలీజ్ డేట్ : 17th మే 2019 న్యూయార్క్‌లో సెటిలైన ఇండియన్‌ మిలియనీర్‌ విద్యా ప్రసాద్‌ (నాగబాబు) కొడుకు అరవింద్ ప్రసాద్‌ (అల్లు శిరీష్‌) అలియాస్‌ అవి.. తన అత్త కొడుకు బాషా అలియాస్‌ బాలషణ్ముగం (భరత్‌)తో కలిసి జీవితాన్ని సరదాగా గడిపేస్తుంటాడు. ఎలాంటి లక్ష్యం లేకుండా నెలకు 20 వేల డాలర్లు ఖర్చు చేస్తూ లైఫ్ ని లైట్ గా తీసుకొంటాడు అవి. ఎంతో కష్టపడి మిలియనీర్ గా ఎదిగిన విద్యా ప్రసాద్ (నాగబాబు) తన కొడుక్కి డబ్బు విలువ తెలియజేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అవి, బాషాను ఇండియాకి పంపిస్తాడు. అలా ఇండియాకు పంపించిన వారిద్దరూ నెలకు 5000 వేలు మాత్రమే ఖర్చు చేస్తూ ఎంబీఏ పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. లగ్జరీ లైఫ్ కి అలవాటు పడిన అవి, భాషాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటారు. అలా తప్పనిసరి పరిస్థితుల్లో హైదరాబాద్‌లో సెటిల్ అయిన అవికి లోకల్ పొలిటీషన్‌ భార్గవ్‌(రాజా)తో గొడవ అవుతుంది. ఇంతకీ అవి, భార్గవ్‌ల మధ్య గొడవేంటి..? అమెరికాలో పుట్టి పెరిగిన అవి, బాషాలు చివరికి ఇండియాలో ఎలా సర్ధుకుపోయారు..? స్లమ్ జీవితాన్ని గడిపిన అవి చివరికి ఏం తెలుసుకున్నాడు..? అనేది సినిమా కథాంశం.

======================== Shaadi-Mubarak-movie-fpc-zeecinemalu

షాదీ ముబారక్ నటీ నటులు : వీర్‌సాగర్‌, దృశ్యా రఘునాథ్‌, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్‌, ప్రియదర్శి రామ్‌, హేమంత్‌, శత్రు, భద్రమ్‌, మధునందన్‌, అదితి, అజయ్‌ ఘోష్ తదితరులు. కెమెరా : శ్రీకాంత్‌ నారోజ్ ఆర్ట్‌: నాని ఎడిటర్‌: మధు సంగీతం: సునీల్‌ కశ్యప్‌ అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌: టి. శ్రీనివాస్‌రెడ్డి, నిర్మాతలు: రాజు, శిరీష్‌, కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: పద్మ శ్రీ నిడివి : 136 నిముషాలు విడుదల : 5 మార్చ్ 2021 ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తూ పెళ్లిచూపుల కోసం ఇండియా వచ్చిన మాధవ్ సున్నిపెంట(వీర్ సాగర్) ఒక మ్యారేజ్ బ్యూరో సహాయంతో ఒకే రోజు మూడు పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటాడు. తన తల్లి కాలికి గాయం అవ్వడంతో ఆ పెళ్లి చూపులకి మాధవ్ ని తీసుకెళ్ళే బాధ్యత సత్యభామ పై పడుతుంది. మొదటి చూపులోనే సత్యభామతో ప్రేమలో పడతాడు మాధవ్. కారులో పెళ్లి చూపులకు తిప్పుతూ సత్యభామ కూడా మాధవ్ తో ప్రేమలో పడుతుంది. కానీ తమ ప్రేమ గురించి ఒకరికొకరు చెప్పుకునే లోపే మాధవ్ కి పెళ్లి చూపులకు వెళ్ళిన ఒకమ్మాయితో పెళ్లి నిశ్చయమవుతుంది. ఇంతకీ ఆ పెళ్లికి మాధవ్ ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ? ఫైనల్ గా సున్నిపెంట మాధవ్ , తుపాకుల సత్యభామ ఒకటయ్యారా లేదా అనేది మిగతా కథ.

============================= Bommarillu-zeecinemalu

బొమ్మరిల్లు నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్ డైరెక్టర్ : భాస్కర్ ప్రొడ్యూసర్ : దిల్ రాజు రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006 తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

============================ iSmart-Shankar-fpc-zeecinemalu

ఇస్మార్ట్ శంకర్ నటీనటులు: రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, సత్య దేవ్ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: రాజ్ తోట బ్యానర్: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్ నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్ రచన – దర్శకత్వం : పూరి జగన్నాధ్ రిలీజ్ డేట్ : జులై 18, 2019 ఇస్మార్ట్ శంకర్ (రామ్) పక్కా రౌడీ. హైదరాబాద్ లో సెటిల్ మెంట్స్ చేస్తుంటాడు. ఓరోజు భారీ డీల్ వస్తుంది. అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రిని హత్య చేస్తాడు. పోలీసులకు దొరక్కుండా లవర్ చాందిని (నభా నటేష్)తో కలిసి గోవాకు పారిపోతాడు. కానీ పోలీసులు అతడ్ని కనుక్కుంటారు. శంకర్ ను పట్టుకునే క్రమంలో బుల్లెట్స్ తగిలి చాందిని చనిపోతుంది. తన ప్రేయసిని చంపిన వాళ్ల కోసం శంకర్ వెదుకుతుంటాడు. అదే క్రమంలో కొన్ని కీలక పరిణాల మధ్య సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) చనిపోతాడు. అదే ప్రమాదంలో శంకర్ కూడా గాయపడతాడు. అరుణ్ మెమొరీని శంకర్ బ్రెయిన్ లోకి ఎక్కిస్తుంది సారా (నిధి అగర్వాల్). ఇంతకీ సారా ఎవరు? శంకర్-అరుణ్ మధ్య సంబంధం ఏంటి? తన లవర్ ను చంపిన దుండగుల్ని శంకర్ పట్టుకున్నాడా లేదా అనేది బ్యాలెన్స్ కథ.

================================ nannu-evaru-aapaleru-movie-నన్ను-ఎవరూ-ఆపలేరు-fpc-zeecinemalu

నన్ను ఎవ్వరూ ఆపలేరు నటీనటులు – జయం రవి, రాశిఖన్నా, సంపత్ రాజ్ రచన-దర్శకత్వం – కార్తీక్ తంగవేళ్ మ్యూజిక్ – శ్యామ్ సీఎస్ డీవోపీ – సత్యన్ సూర్యన్ ఎడిటర్ – రూబెన్ ఫైట్స్ – స్టంట్ శివ జయం రవి నటించిన యాక్షన్ డ్రామా నన్ను ఎవ్వరూ ఆపలేరు. సిన్సియర్ పోలీసాఫీసర్ గా పేరుతెచ్చుకున్న హీరో అకారణంగా సస్పెండ్ అవుతాడు. దీంతో కొంతమంది పెద్దమనుషులతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడతాడు. ఈ క్రమంలో తన ఆప్తుల్ని కోల్పోతాడు. అలా పగతో రగిలిపోతున్న హీరో, ప్రత్యర్థులపై ఎలా తన కక్షను తీర్చుకున్నాడనేది స్టోరీ.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics