Satyadev’s ‘GurtundaSeetakalam’ releasing on December 9th

Monday,November 28,2022 - 11:44 by Z_CLU

 Satyadev's 'GurtundaSeetakalam' releasing on December 9th

ఫీల్ గుడ్ మూవీగా తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’ (Gurtunda Seethakalam) ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ అవ్వబోతుంది. టాలెంటెడ్ యంగ్ హీరో స‌త్యదేవ్, మిల్కి బ్యూటీ త‌మ‌న్నా కాంబినేషన్ లో వస్తున్నఈ సినిమాకు నాగశేఖర్ దర్శకుడు. మేఘ ఆకాష్ , కావ్య సత్య దేవ్ సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

చాలామంది త‌మ జీవితంలో సెటిల్ అయిన తర్వాత, వెనక్కు తిరిగి చూసుకుంటే కొన్ని జ్ఞాపకాలను ఎప్పటికీ మ‌రిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వ‌చ్చే యూత్ లైఫ్‌లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు జీవితాంతం గుర్తుకు వ‌స్తూనే ఉంటాయి.ఇలాంటి సంఘ‌ట‌నలు ప్రేక్షకుల‌కి గుర్తు చేసే ఉద్దేశ్యంతో 'గుర్తుందా శీతాకాలం' సినిమాను రూపొందించారు.

క‌న్నడలో విడుద‌లై సూప‌ర్ హిట్ అనిపించుకున్న ‘ల‌వ్ మాక్‌టైల్’ సినిమా ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ తెరకెక్కింది. ఇదివరకే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేసిన కాలభైరవ ట్యూన్స్ కూడా మంచి ఫీల్ ను క్రియేట్ చేసాయి.

దాదాపుగా అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ ప్యూర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ఈ శీతాకాలంలో థియేటర్స్ లోకి వస్తోంది.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics