Satyadev mesmarizes with his performance with Gurthunda Seethakalam

Monday,July 11,2022 - 10:38 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్న విలక్షణ నటుడు సత్యదేవ్ త్వరలోనే మరో సినిమాతో మనముందుకు రాబోతున్నాడు. ఆ సినిమా పేరు గుర్తుందా శీతాకాలం. ఈ మూవీలో సత్యదేవ్ సరసన మిల్కీబ్యూటీ తమన్న హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. కావ్య శెట్టి, మేఘా ఆకాష్ కూడా హీరోయిన్లుగా నటించారు.

ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. తాజాగా అంతా కలిసి ఓ షో కూడా వేసుకున్నారు. ఫస్ట్ కాపీ చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, సత్యదేవ్ తన పెర్ఫార్మెన్స్ తో అందర్నీ మెస్మరైజ్ చేసి పడేశాడు.

సత్యదేవ్ మంచి పెర్ఫార్మర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అంత టాలెంట్ ఉంది కాబట్టి, చాలా తక్కువ టైమ్ లోనే బాలీవుడ్ స్థాయికి ఎదగగలిగాడు సత్యదేవ్. అయితే ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే, గుర్తుందా శీతాకాలం మాత్రం నెక్ట్స్ లెవెల్ అంటున్నారు సినిమా చూసినోళ్లు.

GurthundaSeethakalam-still-zeecinemalu

ఈ మూవీలో ఏకంగా 3 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడట సత్యదేవ్. ఒకదానికి ఒకటి సంబంధం లేని ప్రతి షేడ్ లో తన మార్క్ చూపించాడట ఈ నటుడు. ఈ ట్రాన్స్ ఫర్మేషన్ అందర్నీ కట్టిపడేసింది. తమన్న లాంటి సీనియర్ నటి సీన్ లో ఉన్నప్పటికీ.. సినిమా మొత్తం సత్యదేవ్ వన్ మేన్ షో చూస్తారని అంటున్నారు.

gurthunda seethakalm satyadev tamanna 2 (1)

నాగశేఖర్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ఎమ్మెస్ రెడ్డి, చినబాబు ప్రజెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. వేదాక్షర మూవీస్, మణికంఠ ఫిలిమ్స్,నాగశేఖర్ మూవీస్ బ్యానర్లపై... భావన రవి, రామారావు చింతపల్లి, నాగశేఖర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలభైరవ మ్యూజిక్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ కు మంచి క్రేజ్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా షో చూసిన జనాల మౌత్ టాక్ తో ఈ సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. త్వరలోనే థియేటర్లలోకి వస్తోంది గుర్తుందా శీతాకాలం మూవీ.