Satya Dev , Tamannaah’s ‘Gurthunda Seetakalam’ first look released !
Monday,February 15,2021 - 04:14 by Z_CLU
టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'గుర్తుందా శీతాకాలం' సినిమా ఫస్ట్ లుక్ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేసారు. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్‌లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటణలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో నాగశేఖర్ మూవీస్ బ్యానర్ మీద నాగశేఖర్ - భావనరవి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు గారు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'గుర్తుందా శీతాకాలం'.
మేఘా ఆకాష్, కావ్యశెట్టి తదితరులు నటిస్తున్న ఈ సినిమాను కన్నడలో విడుదలై సూపర్ హిట్ అయిన లవ్ మాక్ టేల్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే రెండో షెడ్యుల్ జరుపుకుంది.