#SarkaruVaariPaata Birthday Blaster is a HIT

Monday,August 09,2021 - 07:03 by Z_CLU

ముందు నుండి మేకర్స్ ప్లాన్ చేసినట్టు సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా 'సర్కారు వారి పాట' టీజర్ ని రిలీజ్ చేశారు. ప్రకటించిన టైం కంటే ముందే టీజర్ వదిలి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. #SuperStarBirthdayBlaster పేరుతో విడుదల చేసిన ఈ టీజర్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెంచేస్తుంది. దుబాయ్ లో షూట్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ తో మొదలయ్యే ఈ టీజర్ ను లాస్ట్ లో కీర్తి సురేష్ , మహేష్ ట్రాక్ తో ఎండ్ చేశారు. ముఖ్యంగా మహేష్ లుక్, స్టయిల్ టీజర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఎప్పటి కంటే మరింత గ్లామర్ గా కనిపిస్తూ లాంగ్ హెయిర్ తో స్టైలిష్ లుక్ తో ఎట్రాక్ట్ చేశాడు మహేష్. అలాగే సినిమాలో మహేష్ క్యారెక్టర్ కామిక్ గా ఉండనుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ ఖలేజా, దూకుడు స్టైల్ లో మహేష్ కామెడీ చేయనున్నాడని సీన్స్ చూస్తే తెలుస్తుంది. ఇక వెన్నెల కిషోర్ - మహేష్ కామెడీ ట్రాక్ కూడా సినిమాకు హైలైట్ కానుందని క్లిప్స్ తో హింట్ ఇచ్చాడు దర్శకుడు పరశురాం.

"ఇందు మూలంగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా .." అనే వాయిస్ ఓవర్ తో స్టార్టయిన 'సర్కారు వారి పాట' బ్లాస్టర్ లో మహేష్ లుక్, తమన్ మ్యూజిక్, టైగర్-రాబిట్ డైలాగ్, మహేష్-కీర్తి సీన్స్, వెన్నెల కిషోర్ కామెడీ షాట్స్ హైలైట్ గా నిలిచాయి. "సర్ కు పడుకునే ముందు దిష్టి తీయడం మర్చిపోకండి" అంటూ మహేష్ అందాన్ని ఎలివేట్ చేస్తూ కీర్తి చెప్పిన డైలాగ్ కూడా ఇందులో హైలైట్ అయింది. ఇలా అన్నీ మిక్స్ చేసి వన్ మినిట్ టీజర్ తో ఫుల్ మీల్స్ అందించాడు డైరెక్టర్ పరశురాం. చివర్లో మరోసారి సంక్రాంతి రిలీజ్ అంటూ చెప్తూ టీజర్ ని ఎండ్ చేశారు. మరి ఈ బ్లాస్టర్ తో సూపర్ స్టార్ ఎన్ని వ్యూస్ కొల్లగొట్టి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics