SarkaruVaari Paata – Location Change

Thursday,January 21,2021 - 01:50 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ హీరోగా రాబోతున్న సినిమా సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్లాన్ మారింది.

ముందుగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. డెట్రాయిట్ లాంటి ప్రాంతాల్లో లొకేషన్లు కూడా ఫైనల్ చేశారు. కానీ ఆఖరి నిమిషంలో ఆ ప్లాన్ నుంచి తప్పుకున్నారు.

ఇప్పుడీ సినిమా ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో స్టార్ట్ అవుతుంది. ఈనెల 25 నుంచి సర్కారువారి పాట ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో మొదలవుతుంది. నెల రోజుల పాటు సాగనున్న ఈ షూటింగ్ కోసం ఆల్రెడీ కీర్తిసురేష్ దుబాయ్ చేరుకుంది. మొదటి రోజు నుంచే మహేష్ కూడా షూటింగ్ లో పాల్గొంటాడు.

దుబాయ్ షెడ్యూల్ తర్వాత మిగతా షూట్ మొత్తం హైదరాబాద్ లోనే ఉంటుంది. ఈసారి పాటల కోసం కూడా సెట్స్ వేయాలని నిర్ణయించారు. ఫారిన్ లొకేషన్స్ ఆల్ మోస్ట్ కట్ చేశారు.