‘Saranga Dariya’ getting a good response !

Monday,March 08,2021 - 03:49 by Z_CLU

నాగ చైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న 'లవ్ స్టోరీ' సినిమా నుండి విడుదలైన మూడో సాంగ్ హల్చల్ చేస్తూ మ్యూజిక్ లవర్స్ ఫేవరేట్ లిస్టులో చేరిపోయింది. పవన్ Ch కంపోజ్ చేసిన "సారంగ దరియా" అంటూ వచ్చే ఈ సాంగ్ కి తెలంగాణా సాహిత్యంతో సుద్దాల అశోక్ తేజ రాసిన లిరిక్స్ హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా మంగ్లీ వాయిస్ కూడా పాటకు మరింత అందం తీసుకొచ్చింది.

సమంత లాంచ్ చేసిన ఈ సాంగ్ ప్రస్తుతం యూ ట్యూబ్ లో 30 మిలియన్ వ్యూస్ దాటి 50 మిలియన్ వైపు దూసుకెళ్తుంది.  అతి త్వరలోనే ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్ 2021 టాప్ లిస్టులో చోటు సంపాదించుకోవడం ఖాయమనిపిస్తుంది. సినిమాలో ఈ సాంగ్ విజువల్ తో ఇంకా ఎట్రాక్ట్ చేయనుందని లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా సాయి పల్లవి ఎనర్జిటిక్ డాన్స్ ఈ ఫోక్ నంబర్ కి మరింత వాల్యూ తీసుకొచ్చేలా ఉంది.

ఇటివలే షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ క్యూట్ 'లవ్ స్టోరీ' ఏప్రిల్ 16 న థియేటర్స్ లోకి రానుంది.