Santosh Sobhan Mehreen’s Manchi Rojulu Vachayi to release on November 4

Tuesday,October 05,2021 - 03:54 by Z_CLU

యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా వరస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు మారుతి రూపొందిస్తున్న కొత్త సినిమా మంచి రోజులు వచ్చాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌, సోసోగా ఉన్నా. ఎక్కేసిందే పాటలకు  అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేశారు దర్శక నిర్మాతలు.

Manchi Rojulu Vachayi movie stills zeecinemalu

దీపావళి సందర్భంగా నవంబర్ 4న మంచి రోజులు వచ్చాయి సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా పోస్టర్ కూడా విడుదల చేశారు మేకర్స్. మహానుభావుడు లాంటి సూపర్ హిట్ తర్వాత మారుతి కాంబినేషన్‌లో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Manchi Rojulu Vachayi movie stills zeecinemalu ఈ సినిమాను వి సెల్యులాయిడ్ SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఈయన నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, వి సెల్యులాయిడ్ SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు మంచి రోజులు వచ్చాయి సినిమా వస్తుంది. ఏక్ మినీ కథ లాంటి హిట్ సినిమాను నిర్మించిన యూవీ కాన్సెప్ట్స్‌తో మరోసారి జోడీ కట్టాడు సంతోష్ శోభన్. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన వివరాలు దర్శక నిర్మాతలు త్వరలోనే తెలియజేయనున్నారు.

టెక్నికల్ టీం: కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మారుతి నిర్మాత: వి సెల్యూలాయిడ్ SKN బ్యానర్స్: యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ సంగీతం: అనూప్ రూబెన్స్ పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics