#Sankranthi2022 – Big Box Office War

Tuesday,August 03,2021 - 01:48 by Z_CLU

టాలీవుడ్ లో ప్రతీ ఏడాది మూడు నాలుగు సినిమాల మధ్య సంక్రాంతి పోటీ నెలకొంటుంది. ఆ పోటీలో విజేతగా నిలిచే హీరో ఎవరా అంటూ ఎంతో ఆసక్తిగా చూస్తారు ఫ్యాన్స్. నెల రోజుల ముందు నుండే సినిమా ప్రమోషన్స్ తో హోరెత్తించి సంక్రాంతి సీజన్ లో భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే ప్లానింగ్ లో ఉంటారు మేకర్స్. అయితే ప్రతీ ఏడాది లాగే వచ్చే సంక్రాంతి కి కూడా టాలీవుడ్ లో పోటీ నెలకొననుంది.

అయితే ఈసారి పోటీ మాములుగా ఉండదు. వచ్చే సంక్రాంతి కి టాప్ హీరోలు తమ సినిమాలతో పోటీ పడబోతున్నారు. పవన్ కళ్యాణ్ , మహేశ్ బాబు , ప్రభాస్ మధ్య ఈసారి గట్టి పోటీ నెలకొననుంది. అవును పవన్ కళ్యాణ్ రానాతో కలిసి నటిస్తున్న నటిస్తున్న సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా డేట్ ఎనౌన్స్ చేయలేదు కానీ సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు.

ఇక మహేష్ 'సర్కారు వారి పాట' సంక్రాంతి రిలీజ్ అంటూ ఎప్పుడో ప్రకటించారు మేకర్స్. తాజాగా డేట్ కూడా ఫిక్స్ చేసుకొని ఎనౌన్స్ మెంట్ ఇచ్చారు. 2022 జనవరి 13న సినిమాను విడుదల చేయనున్నట్లు ఫస్ట్ నోటీస్ (పోస్టర్) ద్వారా తెలిపారు. ఇక జనవరి 14 అంటే సరిగ్గా మహేష్ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన మరుసటి రోజే ప్రభాస్ 'రాధేశ్యామ్' అంటూ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూడు సినిమాలతో పాటు వెంకటేష్ , వరుణ్ తేజ్ కాంబినేషన్ లో 'F2'కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'F3' కూడా సంక్రాంతి బరిలో నిలవబోతుంది. ఇలా నాలుగు పెద్ద సినిమాలు వచ్చే మకర సంక్రాంతికి పోటీ పడనున్నాయి. మరి వీటిలో ఏదైనా పోస్ట్ పోన్ అవుతుందా ? లేదా చెప్పిన డేట్ కి వచ్చేస్తారా ? వేచి చూడాలి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics