Samantha reveals her Beauty Secret

Tuesday,December 07,2021 - 02:47 by Z_CLU

సమంతకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే సమంత స్కిన్ టోన్ కు ప్రత్యేకంగా ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇన్నేళ్లయినా సమంత స్కిన్ గ్లో ఎందుకు తగ్గలేదనే డిస్కషన్ కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఎట్టకేలకు తన గ్లామర్ సీక్రెట్ పై రియాక్ట్ అయింది సమంత.

ఉదయం లేచిన వెంటనే ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటుందట ఈ బ్యూటీ. ఇక రాత్రి పడుకునే ముందు కచ్చితంగా కొన్ని ఆయిల్స్ పూసుకుంటుందట. ఈ ఆయిల్స్ వద్ద చర్మం ముడతలు పడకుండా, మరింత నిగారింపుగా ముఖం తయారవుతుందని చెబుతోంది. పొద్దున్న లేచిన వెంటనే తన దిండు మాత్రం ఆయిల్స్ తో చెత్తగా అయిపోతుందనని, కానీ స్కిన్ ఆయిల్స్ రాసుకోవడం మాత్రం మరిచిపోనని అంటోంది.

ఇక తన బ్యాగ్ లో రెగ్యులర్ గా ఉండే బ్యూటీ ఐటమ్స్ లిస్ట్ కూడా సమంత బయటపెట్టింది. తన బ్యాగ్ లో కచ్చితంగా మేకప్ రిమూవర్ ఉంటుందట. దీంతో పాటు సన్ స్క్రీన్ లోషన్లు 2 రకాలు, మరో 3-4 రకాల లిప్ బామ్స్ ఉంటాయట. ఇంకా కొన్ని రకాల సీరమ్స్ కూడా ఉంటాయట. వీటికి అదనంగా విటమిన్ టాబ్లెట్స్ కూడా తన బ్యాగ్ లో ఎప్పుడూ రెడీగా ఉంటాయంటోంది సమంత.

ప్రస్తుతం పుష్ప సినిమాలో ఐటెంసాంగ్ చేస్తోంది సమంత. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కు, బన్నీ స్టెప్పులకు సింక్ అయ్యేలా డాన్స్ చేయడం చాలా కష్టంగా ఉందని అంటోంది.