Saiee Manjrekar in Allu Arjun-Koratala Movie

Sunday,January 17,2021 - 02:35 by Z_CLU

కొరటాల శివ-అల్లు అర్జున్ కాంబినేషన్ తెరకెక్కనున్న AA21 సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో బన్నీ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ Saiee Manjrekar ను తీసుకోనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం Saiee తెలుగులో వరుణ్ తేజ్ 'బాక్సర్'(వర్కింగ్ టైటిల్) సినిమాతో పాటు 'మేజర్' సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు ఆమె చేతిలో మరిన్ని తెలుగు సినిమా ఆఫర్స్ కూడా ఉన్నాయట. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ అమ్మడు అల్లు అర్జున్ కి హీరోయిన్ గా దాదాపు ఫిక్స్ అంటున్నారు.

ప్రస్తుతం కొరటాల శివ 'ఆచార్య' తో బిజీగా ఉండగా బన్నీ 'పుష్ప' సినిమా సెట్స్ లో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు ఫినిష్ అయ్యాకే తమ కాంబో సినిమాను స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ సినిమాకు క్యాస్టింగ్ తో పాటు టెక్నీషియన్స్ ని కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు టీం.