Sai Tej’s Republic Motion poster

Monday,January 25,2021 - 06:16 by Z_CLU

షార్ట్ గ్యాప్ లో మరో మూవీ రెడీ చేశాడు మెగా హీరో సాయితేజ్. దేవకట్టా డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో టైటిల్ ఎనౌన్స్ చేశారు.

సాయితేజ్-దేవకట్టా సినిమాకు రిపబ్లిక్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రిపబ్లిక్ డే కానుకగా ఈ టైటిల్ ను రిలీజ్ చేశారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేసేందుకు ఇది పెర్ ఫెక్ట్ టైమింగ్.

టైటిల్ ఎనౌన్స్ మెంట్ లో భాగంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమా థీమ్ ఏంటనే విషయాన్ని సింపుల్ అండ్ స్ట్రయిట్ గా మోషన్ పోస్టర్ లో చెప్పేశారు.

ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ ఎట్రాక్షన్ గా రాబోతున్న ఈ సినిమాను జేబీ ఎంటర్ టైన్ మెంట్స్, జీ స్టుడియోస్ సంస్థలు జాయింట్ గా రిలీజ్ చేయబోతున్నాయి.