Sai Pallavi ready with another Chartbuster song in #ShyamSingaRoy !

Thursday,October 21,2021 - 12:27 by Z_CLU

సాయి పల్లవి డాన్స్ చేస్తూ ఓ సినిమా సాంగ్ రిలీజైతే చాలు. వెంటనే ఆ సాంగ్ మిలియన్స్ వ్యూస్ తో దూసుకెళ్ళడం ఖాయం. అవును సాయి పల్లవి డాన్స్ కున్న క్రేజ్ అలాంటిది. మంచి సాంగ్ పడాలే కానీ తన డాన్స్ తో మేజిక్ చేసి మెస్మరైజ్ చేయడం సాయి పల్లవి కి వెన్నతో పెట్టిన విద్య. ఫిదా లోని "వచ్చిండే", ధనుష్ చేసిన 'రౌడీ బేబీ' , రీసెంట్ గా వచ్చిన 'సారంగ దరియా' కూడా రికార్డు వ్యూస్ తో ఆ లిస్టులో చేరిపోయింది.

ఇప్పుడు సాయి పల్లవి నుండి ఆ రేంజ్ సాంగ్ మరొకటి రానుంది. అవును నాని హీరోగా రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోనే సాయి పల్లవి మీద ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేశారు. నవరాత్రి సమయంలో అమ్మవారి మీద వచ్చే ఈ సాంగ్ ని ఇటివలే హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో షూట్ చేశారు.

పద్మావతి సినిమాలో పాటకు కోరియోగ్రఫీ చేసిన బాలీవుడ్ డాన్స్ మాస్టర్ కృతి మహేష్ ఈ సాంగ్ ని కంపోజ్ చేశారట. షూట్ జరుగుతున్నంత సేపు యూనిట్ అంతా సాంగ్ వింటూ సాయి పల్లవి డాన్స్ చేస్తూ మెస్మరైజ్ అయ్యారట. మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ నుండి రీసెంట్ టైం లో బెస్ట్ సాంగ్ ఇదే అంటూ అందరూ చెప్పుకుంటున్నారు కూడా. ఇటివలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది. వచ్చే నెల నుండి ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు. అందులో భాగంగా ముందుగా ఈ సాంగ్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మరి సాయి పల్లవి ఈ సాంగ్ తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

నిహారికా ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకు సత్య దేవ్ జంగా కథ అందిస్తున్నాడు. నాని సరసన సాయి పల్లవి , కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics