Sai Pallavi in Soundarya Biopic

Monday,October 12,2020 - 02:26 by Z_CLU

యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలేమైనా ఉంటే అవి ప్రస్తుతం సాయిపల్లవి, కీర్తిసురేష్ లాంటి కొద్దిమంది హీరోయిన్లకే దక్కుతున్నాయి. వీళ్లిద్దరూ తమ యాక్టింగ్ తో ఎలాంటి క్యారెక్టర్ నైనా హిట్ చేయగలరు. అలాంటిదే ఓ మంచి క్యారెక్టర్ SaiPallavi దగ్గరకొచ్చిందని టాక్.

తెలుగులో సూపర్ హిట్ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న సౌందర్య జీవితం, కెరీర్ ఆధారంగా బయోపిక్ రాబోతోంది. ఈ బయోపిక్ లో సౌందర్య పాత్రను పోషించే అవకాశం సాయిపల్లవికి వచ్చినట్టు రూమర్ నడుస్తోంది.

Soundarya క్యారెక్టర్ కు SaiPallavi హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చిపడింది.

బయోపిక్స్ చేయడం సాయిపల్లవికి ఇష్టం లేదు. పైగా ఆమె ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ టైమ్ లో Soundarya Biopic కు ఆమె గ్రీన్ లైట్ ఇస్తుందా అనేది క్వశ్చన్ మార్క్.

Also Read - నేచురల్ స్టార్ తో మరోసారి