Sagar Chandra jackpot with Pawan’s Movie

Thursday,October 29,2020 - 04:58 by Z_CLU

నిజానికి స్టార్ హీరోలెవరైనా ఒకట్రెండు సినిమాలు చేసిన దర్శకుడితో సినిమా చేసేందుకు పెద్దగా ఆసక్తి కనబరచరు. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. కానీ Power Star అలా కాదు. సబ్జెక్ట్ బాగుంటే ఏ దర్శకుడికైనా అవకాశం ఇస్తాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సాగర్ చంద్ర.

ప్రస్తుతం Vakeel Saab , Krish సినిమాలతో బిజీగా ఉన్న Pawan Kalyan త్వరలో Sithara Entertainments బ్యానర్ పై ఓ రీమేక్ సినిమా చేయబోతున్నాడు. దీనికి Sagar K Chandra దర్శకత్వం వహించనున్నాడు. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాను డైరక్ట్ చేశాడు సాగర్. అంతకంటే ముందు అయ్యారే అనే మరో సినిమా చేశాడు. ఇప్పుడు ఏకంగా పవన్ నే డైరక్ట్ చేయబోతున్నాడు.

ఇలా చాలా తక్కువ అనుభవంతో ఏకంగా పవర్ స్టార్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు సాగర్ చంద్ర. ఇది ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది. ఏదేమైనా ఈ విషయంలో పవన్ సూపర్ అంటూ మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు.