S Thaman shares Sai Dharam Tej health update with fans !

Tuesday,September 14,2021 - 02:52 by Z_CLU

మూడ్రోజుల క్రితం మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కి గురై హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. బైక్ పై  ఒంటరిగా వెళ్తూ దుర్గం చెరువు సమీపంలో రోడ్  పై స్కిడ్ అయి పడిపోయాడు తేజ్. దాంతో యంగ్ హీరోకి బాగా గాయాలు అయ్యాయి. సంఘటన జరిగిన స్థలంలో ఉన్న ఓ వ్యక్తి అంబులెన్స్ కి అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తేజ్ ని వెంటనే హాస్పిటల్ లో చేర్చారు. రెండ్రోజులుగా అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తేజ్ హెల్త్ పై నిన్నటి నుండి డాక్టర్స్ నుండి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో మెగా ఫ్యాన్స్ సాయి తేజ్ హెల్త్ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

తాజాగా తేజ్ తో సన్నిహితంగా మెలిగే అతని మిత్రుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సాయి హెల్త్ గురించి ఫ్యాన్స్ కి అప్ డేట్ అందించాడు. "నా స్నేహితుడు కోలుకుంటున్నాడు. తను గట్టి పట్టుదల ఉన్న వ్యక్తి " అంటూ సోషల్ మీడియాలో తేజ్ తో కలిసి దిగిన ఓ పాత ఫోటో కూడా పోస్ట్ చేశాడు. తమన్ ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. తేజ్ కోలుకుంటున్న విషయం తెలిపినందుకు అతనికి థాంక్స్ చెప్తూ రిప్లై ఇస్తున్నారు.

thaman-shares-picture-with-saidharamtej-in-socialmedia

ప్రస్తుతం హాస్పిటల్ లో కోలుకుంటున్న సాయి తేజ్ కి యాక్సిడెంట్ జరిగిన మరుసటి రోజు చిన్న సర్జరీ జరిగిందని సమాచారం. మరికొన్ని రోజుల్లో తేజ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే రెస్ట్ తీసుకోనున్నాడు. కానీ షూటింగ్స్ కి ఎటెండ్ అవ్వడానికి సమయం పడుతుంది.

  - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trendingstories, Gossips, Actress Photos and Special topics