RRR Leaked Stills and Videos
Thursday,March 04,2021 - 12:58 by Z_CLU
ఆర్ఆర్ఆర్ నుంచి మరోసారి లీకులు మొదలయ్యాయి. గతంలో ఓ వీడియో, కొన్ని స్టిల్స్ లీక్ అవ్వగా.. ఈసారి ఏకంగా 5-6 పిక్స్ లీక్ అవ్వడం సంచలనంగా మారింది. వీటిలో ఒకటి పోస్టర్ కాగా.. మిగతా స్టిల్స్ అన్నీ ఆన్-లొకేషన్ లోనివే.
RRRలో ఎన్టీఆర్ పై ఇంట్రో ఫైట్ ఉంది. పెద్ద పులితో తారక్ తలపడే సీన్ అది. ఆ ఫైట్ కు సంబంధించి గతంలోనే ఓ వీడియో లీక్ అయింది. ఇప్పుడు దానికి సంబంధించిన పోస్టర్ లీక్ అయింది. ఇక బ్రిటిష్ పోలీస్ గెటప్ లో ఉన్న రామ్ చరణ్ స్టిల్ తో పాటు.. నిప్పుల్లో ఎన్టీఆర్ ఫైట్ చేస్తున్న పిక్స్ కూడా లీక్ అయ్యాయి.
సినిమా నుంచి ఇలా ఒకేసారి ఇన్ని స్టిల్స్ లీక్ అవ్వడంతో యూనిట్ ఒక్కసారిగా అలెర్ట్ అయింది. ఇప్పటికే లొకేషన్ లో మొబైల్ వాడకాన్ని బ్యాన్ చేశారు. ఇప్పుడు మరింత స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తున్నారు.
అసలే క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఆ షూట్ కు సంబంధించిన స్టిల్స్ కూడా లీక్ అయితే మొదటికే మోసం వస్తుంది. అందుకే రాజమౌళి ఇప్పుడు మరింత కేర్ తీసుకుంటున్నాడు.