‘RowdyBoys’ cross 10 Crore+ streaming minutes in ZEE5 !

Saturday,March 19,2022 - 05:30 by Z_CLU

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అందుకున్న యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రౌడీ బాయ్స్' తాజాగా జీ 5 లో రిలీజైంది. మార్చ్ 11న జీ 5 ద్వారా OTT లో విడుదలైన ఈ సినిమా తక్కువ టైంలో కోటి స్ట్రీమింగ్ మినట్స్ వ్యూస్ దక్కించుకొని రికార్డ్ అందుకుంది.  దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిశ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా  హర్ష కొనుగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా OTT ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పొచ్చు.

సినిమాలో యూత్ కి నచ్చే ఎలిమెంట్స్ తో పాటు మెస్మరైజ్ చేసే మ్యూజిక్ , హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసే ఫన్ తో పాటు ఎమోషన్ కూడా బాగా పండింది. అందుకే ఈ సినిమాను ఓ టి టి లో చూసేందుకు ఆడియన్స్  ఆసక్తి కనబరుస్తున్నారు.

తాజాగా జీ5 విడుదలయిన అన్ని సినిమాలు మంచి వ్యూస్ దక్కించుకుంటున్నాయి. అలాగే వెబ్ సిరీస్ లు కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. ఇప్పుడు 'రౌడీ బాయ్స్' వాటిని అధిగమించి భారీ వ్యూస్ కొల్లగొట్టింది. మునుముందు ఈ సినిమా మరిన్ని రికార్డ్ వ్యూస్ దక్కించుకుంటూ OTT లో బిగ్గెస్ట్ అనిపించుకోనుంది.