Release date locked for SarkaruVaariPaata ?

Friday,December 11,2020 - 06:22 by Z_CLU

సూపర్ స్టార్ Mahesh Babu అప్ కమింగ్ మూవీ 'SarkaruVaariPaata' రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ లో డిస్కషన్ నడుస్తుంది. పరశురాం దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఓ స్పెషల్ డేట్ ని మేకర్స్ లాక్ చేసారని సమాచారం.  మహేష్ శ్రీమంతుడు రిలీజైన ఆగస్ట్ 7 న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. వచ్చే ఏడాది ఆగస్ట్ కల్లా టోటల్ షూట్ ఫినిష్ చేసి ఆ డేట్ ని అందుకోవాలని చూస్తున్నారట.

ప్రస్తుతం తన టీంతో కలిసి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ చేస్తున్నాడు పరశురాం.  జనవరి నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ సినిమాను ముందుగా హైదరాబాద్ లో కొంత పార్ట్ షూట్ చేసి తర్వాత అమెరికా వెళ్లనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.