#RC15 launched in Hyderabad today !

Wednesday,September 08,2021 - 12:57 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న #RC15 గ్రాండ్ గా లాంచ్ అయింది. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ మెగా ప్రాజెక్ట్ కి మెగా స్టార్ చిరంజీవి క్లాప్ ఇచ్చారు. అలాగే రాజమౌళి , రన్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉదయాన్నే ఎనౌన్స్ మెంట్ పోస్టర్ తో అందరినీ సర్ప్రయిజ్ చేశారు శంకర్.

RC15 ANOUNCEMENT

సినిమా ఎలా ఉండబోతుంది ? ఈ ప్రాజెక్ట్ లో ఎవరెవరు ఉన్నారు ? అనే డీటెయిల్స్ మొత్తం బ్రాండ్ పోస్టర్ లో ఇచ్చేసి మూవీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేశారు. రామ్ చరణ్ , కియరా అద్వాని తో పాటు సినిమాలో కీ రోల్ లో కనిపించనున్న జయరాం , శ్రీకాంత్ , అంజలి , సునీల్, నవీన్ చంద్ర వంటి నటులతో పాటు సాంకేతిక నిపుణులు తమన్ , తిరు , సాయి మాధవ్ బుర్రా, ప్రొడక్షన్ డిజైనర్స్ రామకృష్ణ సబ్బాని,  మౌనిక నిగొత్రే, జానీ మాస్టర్, అనంత్ శ్రీరామ్ ల స్టిల్స్ కూడా పోస్టర్ లో వేసి కాస్ట్ అండ్ క్రూ ని గ్రాండ్ గా పరిచయం చేశారు. ఇక నిర్మాతలు దిల్ రాజు , శిరీష్ ల స్టిల్స్ కూడా పోస్టర్ లో కనిపించాయి. శంకర్ సినిమా అంటే అందులో కచ్చితంగా సామజిక అంశంతో కూడిన ఓ సందేశం కూడా ఉంటుంది. ఇందులో కూడా ఆయన మార్క్ మెసేజ్ ఉంటుందని తెలుస్తుంది. ఇదొక పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని సమాచారం.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ముందుగా హైదరాబాద్ లో మొదటి షెడ్యుల్ జరగనుంది.  దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ లో 50వ సినిమా కావడం విశేషం.

    - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trendingstories, Gossips, Actress Photos and Special topics