RaviTeja’s ‘Dhamaka’ Movie Shooting Updates !

Saturday,November 13,2021 - 01:10 by Z_CLU

రవితేజ జెట్ స్పీడులో సినిమాలు చేయడమే కాదు షెడ్యుల్స్ కూడా అదే స్పీడుతో పూర్తి చేస్తున్నాడు. 'ధమాకా' సినిమా మొదలై నెల అయ్యింది. ఈ లోపు రెండు షెడ్యుల్స్ కంప్లీట్ చేసేశాడు మాస్ మహారాజా. దాదాపు పదిహేను రోజుల పాటు రెండో షెడ్యుల్ జరిగింది. ఈ షెడ్యుల్ లో రవితేజ తో పాటు హీరోయిన్ శ్రీ లీల , సచిన్ ఖేడెకర్, పవిత్ర లోకేష్ , తనికెళ్ళ భరణి పాల్గొన్నారు.

అల్యుమినియం ఫ్యాక్టరీ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. అలాగే హైటెక్ సిటీలో కొన్ని సీన్స్ , ట్రైడెంట్ హోటల్ లో మరికొన్ని సీన్స్ షూట్ చేశారు. సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ షెడ్యుల్ లో ఒక రోల్ కి సంబంధించి సీన్స్ తీశారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ప్రీ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం దొరకడంతో మేకింగ్ చాలా స్పీడ్ గా చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకొని సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది.

త్రినాద్ రావు నక్కిన దర్శకత్వంలో మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ కథ -మాటలు అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై TG విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సేసిరోలియో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. త్వరలోనే మూడో షెడ్యుల్ మొదలు పెట్టి మరికొన్ని సీన్స్ , సాంగ్స్ షూట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు యూనిట్.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics