Raviteja very busy with Five films right now !

Saturday,November 06,2021 - 10:17 by Z_CLU

మాస్ మహారాజా రవితేజ చేతిలో ఇప్పుడు నాలుగు సినిమాలున్నాయి. అవును తన స్పీడుతో  యంగ్ హీరోలకి సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు రవితేజ. 'ఖిలాడి' షూటింగ్ స్టేజిలో ఉండగానే 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాను సెట్స్ పై పెట్టేసిన రవితేజ 'ధమాకా' అనే ఇంకో సినిమాను కూడా మొదలు పెట్టేశాడు. ఒకే టైంలో మూడు సినిమాలు చేస్తున్నాడు అనుకునే లోపే ఇంకో రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు.

నెక్స్ట్ వంశీ కృష్ణ డైరెక్షన్ లో 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమా చేయబోతున్నాడు రవితేజ.  ఒక గజదొంగ బయోపిక్ గా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. అలాగే సుదీర్ వర్మ డైరెక్షన్ లో 'రావణాసుర' అనే సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించి టైటిల్ తో పాటు తన లుక్స్ ఎలా ఉంటాయో కూడా చూపించాడు రవితేజ.

నిజానికి రవితేజ నుండి ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు గ్యారెంటీగా వచ్చేవి. కానీ ఈ మధ్య స్పీడు తగ్గించి ఏడాదికో సినిమా మాత్రం అందిస్తూ వస్తున్న రవితేజ ఇప్పుడు తన స్పీడు అమాంతంగా పెంచి ఏకంగా ఐదు సినిమాలు రెడీ చేస్తున్నాడు. ఇందులో వచ్చే ఏడాది గ్యారెంటీగా మూడు సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులో సందేహం లేదు. ఇక టైగర్ నాగేశ్వరరావు తో పాటు 'రావణాసుర' సినిమాలో రవితేజ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండనుందని టాక్ వినిపిస్తుంది.

 'క్రాక్' తర్వాత జెట్ స్పీడులో సినిమాలు లైనప్ లో పెట్టేసి ఒకే టైం రెండు మూడు సినిమాలు సెట్స్ పైకి తెచ్చేస్తున్న రవితేజ వీటితో వరుస బ్లాక్ బస్టర్స్ కొట్టాలని చూస్తున్నాడు. చూడాలి ఈ సినిమాలతో మాస్ మహారాజా ఎలాంటి హిట్స్ అందుకుంటాడో మరి.

  Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics