Raviteja starts dubbing for Krack

Wednesday,December 30,2020 - 01:06 by Z_CLU

సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రాబోతున్న KRACK మూవీకి సంబంధించి మరో కీలకమైన ఘట్టం మొదలైంది. ఈ సినిమా డబ్బింగ్ వర్క్ మొదలైంది. మాస్ రాజా Raviteja ఈ సినిమా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశాడు. మరో వారం రోజుల్లో సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు రవితేజ. ఇలాంటి పాత్రలు చేయడం మాస్ రాజాకు కొత్తకాదు. పైగా రవితేజను ఎలా చూపించాలో దర్శకుడు Gopichand Malineniకి ఫుల్ క్లారిటీ ఉంది. అందుకే మాస్ పై అంచనాలున్నాయి.

శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి 14న థియేటర్లలోకి రాబోతోంది క్రాక్ మూవీ.

Raviteja-krack-movie-dubbing 1 Raviteja-krack-movie-dubbing 1