RaviTeja rejected Kollywood Movie offer

Monday,May 17,2021 - 12:01 by Z_CLU

మాస్ మహారాజా రవితేజ కోలీవుడ్ లో ఓ ఆఫర్ వదులుకున్నాడనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అవును ఆ మధ్య కోలీవుడ్ సినిమాకు నో చెప్పాడట రవితేజ. అవును ధనుష్ హీరోగా వెట్రి మారన్ దర్శత్క్వంలో తెరకెక్కిన 'వడా చెన్నై' సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం ముందుగా విజయ్ సేతుపతి ని అనుకున్నాడట వెట్రి మారన్. విజయ్ సేతుపతి ని కలిసి స్క్రిప్ట్ నెరెట్ చేశాడట. కానీ విజయ్ ఆ టైంలో వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో హీరో రవితేజకి తో ఆ క్యారెక్టర్ చేయించాలని అనుకున్నాడట దర్శకుడు.

రవితేజ ని కలిసి స్క్రిప్ట్ తో పాటు క్యారెక్టర్ గురించి కూడా చెప్పాడట వెట్రి మారన్. అయితే ఆ టైంలో రవితేజ డేట్స్ అడ్జస్ట్ చేయలేక వెట్రి మారన్ కి సారీ చెప్పి ఆ క్యారెక్టర్ ని వదులుకున్నాడట. ఇక ఫైనల్ ఆ క్యారెక్టర్ కి కోలీవుడ్ దర్శకుడు అమీర్ సుల్తాన్ ని తీసుకొని అతనితో రాజన్ పాత్రను చేయించాడట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకున్నాడు వెట్రి మారన్. దీంతో రవితేజ ధనుష్ కాంబో లో సినిమా న్యూస్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది.

vada-chennai

సో తెలుగులో బిజీగా సినిమాలు చేస్తున్న రవితేజ కి కోలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు ఏ క్యారెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా మన తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెడుతూ అంటూ ముందుకు వెళ్తున్నాడు రవితేజ. మరి మాస్ మహారాజా ఇకపై అయినా ఇతర భాషల్లో సినిమాలు చేస్తాడా లేదా చూడాలి. ప్రస్తుతం 'క్రాక్' సక్సెస్ తో జోరు మీదున్న మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది రవితేజ నుండి మరో రెండు సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics