Raviteja KRACK to release on Sankranti

Sunday,October 25,2020 - 12:23 by Z_CLU

రోజురోజుకు సంక్రాంతి సినిమాల లిస్ట్ పెరుగుతోంది. ఇప్పుడీ జాబితాలోకి మరో క్రేజీ మూవీ వచ్చి చేరింది. Raviteja-ShrutiHassan హీరోహీరోయిన్లుగా నటిస్తున్న క్రాక్ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.

దసరా సందర్భంగా KRACK యూనిట్ నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజైంది. ఈ సందర్భంగా సంక్రాంతి రిలీజ్ మేటర్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి బరిలో ముందుగా థియేటర్లలోకొచ్చే సినిమా ఇదే కావొచ్చు.

ఠాగూర్ మధు నిర్మాతగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో తెరకెక్కుతున్న క్రాక్ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు మాస్ రాజా.

సంక్రాంతికి ఇప్పటికే మోస్ట్ ఎలిబిబుల్ బ్యాచిలర్, రంగ్ దే, అరణ్య, అల్లుడు అదుర్స్, రెడ్ సినిమాలున్నాయి. క్రాక్ రాకతో పోటీ ఇప్పుడు పీక్స్ కు చేరుకుంది.

Also Check - క్రాక్ మూవీ మేకింగ్ వీడియో