Raviteja Khiladi Movie Updates

Saturday,June 26,2021 - 03:23 by Z_CLU

Raviteja Khiladi Movie Updates

మాస్ మహారాజా రవితేజ-రవివర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఖిలాడి' సినిమాకు సంబంధించి ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయింది. కేవలం 25 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం బ్యాలెన్స్ షూట్ ని వీలైనంత ఫాస్ట్ గా ఫినిష్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు యూనిట్. దీని కోసం యూనిట్ వచ్చే నెల దుబాయ్ వెళ్లనుంది. జులై నెలాఖరు నుండి దుబాయ్ లో ఖిలాడి ఫైనల్ షెడ్యుల్ జరుపుకోనుంది. ఈ షెడ్యుల్ లో కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్ కూడా షూట్ చేయనున్నారని తెలుస్తుంది. దుబాయ్ షెడ్యుల్ తో టోటల్ షూట్ కి ప్యాకప్ చెప్పనున్నారు.

రవితేజ డ్యుయల్ రోల్ చేస్తున్న 'ఖిలాడి' పై మంచి అంచనాలున్నాయి. క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ నుండి వస్తున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంటుంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో బిజినెస్ క్లోజ్ అయ్యింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అని ఇన్సైడ్ టాక్. యాక్షన్ ఎపిసోడ్స్ పై చాలా శ్రద్ధ తీసుకొని తెరకెక్కించారని సమాచారం.

సినిమాలో డ్యుయల్ రోల్ లో రవితేజ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా? అని ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. హవిష్ ప్రొడక్షన్ బేనర్ పై కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫైనల్ షెడ్యుల్ పూర్తయిన వెంటనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నారు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics