Raviteja Khiladi Movie Shooting Update

Saturday,September 25,2021 - 03:15 by Z_CLU

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ `ఖిలాడి`.  సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి, వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది. థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌ ఇచ్చేందుకు రమేష్ వర్మ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్,  జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీకాంత్ విస్సా, దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ ఈ సినిమాకు డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యాన్ని అందిస్తుండగా..అమర్ రెడ్డి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

raviteja khiladi movie stills నటీనటులు: రవితేజ, మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి సాంకేతిక బృందం: కథ, కథనం, దర్శకత్వం: రమేష్ వర్మ నిర్మాత: సత్యనారాయణ కోనేరు బ్యానర్: ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ ప్రొడక్షన్: ఏ హవీష్ ప్రొడక్షన్ సమర్పణ: డాక్టర్ జయంతిలాల్ గద సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫర్: సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు స్క్రిప్ట్ కో ఆర్టినేషన్: పాత్రికేయ ఫైట్స్: రామ్ లక్ష్మణ్, అన్బు అరివు డైలాగ్స్: శ్రీకాంత్ విస్స, సాగర్ ఎడిటర్: అమర్ రెడ్డి లిరిక్స్: శ్రీ మణి స్టిల్స్: సాయి మాగంటి మేకప్: ఐ శ్రీనివాసరాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీకృష్ణ కొడాలి ప్రొడక్షన్ హెడ్: పూర్ణ కండ్రు పబ్లిసిటీ: రామ్ పెద్దిటి సుధీర్ కో డైరెక్టర్: పవన్ కేఆర్‌కే ఆర్ట్:  గాంధీ న‌డికుడిక‌ర్‌ పీఆర్ఓ: వంశీ-శేఖర్

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics