Raviteja in Chiranjeevi Bobby Movie

Thursday,September 30,2021 - 05:13 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి ఒకదాని తర్వాత మరొక ప్రాజెక్ట్ లైన్లో పెట్టి వరుస సినిమాలు చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రెజెంట్ కొరటాల శివ డైరెక్షన్ లో 'ఆచార్య' సినిమా చేస్తున్న చిరు నెక్స్ట్ సినిమా 'గాడ్ ఫాదర్' ని ఇటివలే సెట్స్ పై పెట్టేసి షూట్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ తో 'భోళా శంకర్', బాబీ దర్శకత్వంలో #MEGA154 చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ రెండు సినిమాలను ఒకేసారి ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడు మెగాస్టార్.

అయితే చిరు-బాబీ కాంబో సినిమాకు సంబంధించి లేటెస్ట్ ఓ ప్రచారం జరుగుతుంది. సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ రోల్ చేయబోతున్నాడని టాక్ నడుస్తుంది. ఇటివలే బాబీ రవితేజ ని కలిసి క్యారెక్టర్ గురించి చెప్తూ స్క్రిప్ట్ నెరేట్ చేశాడని సమాచారం. బాబీ రవితేజ పేరు చెప్పగానే చిరు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఈ క్యారెక్టర్ కి రవి పర్ఫెక్ట్ అంటూ చెప్పారని తెలుస్తుంది.

khiladi raviteja

రవితేజ మెగా స్టార్ కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. గతంలో చిరుతో కలిసి నటించాడు కూడా. ముఖ్యంగా అన్నయ్య సినిమాలో చిరు తమ్ముడిగా నటించి మెప్పించారు మాస్ మహారాజా. ఇక రవితేజ దర్శకుడు బాబీ మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. పవర్ సినిమాతో బాబీ ని దర్శకుడిగా పరిచయం చేశాడు రవితేజ. అందుకే తను చేయబోయే మెగా ప్రాజెక్ట్ లో రవితేజ కోసమే ఒక రోల్ క్రియేట్ చేసి దాన్ని చేయించాలని చూస్తున్నాడట. రవితేజ హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ మెగా స్టార్ చెప్తే కచ్చితంగా సినిమాలో ఆ ఇంపార్టెన్స్ క్యారెక్టర్ చేయడం పక్కా.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics