Rashmika with 2 Movies

Tuesday,October 27,2020 - 03:41 by Z_CLU

Sarileru Neekevvaru , Bheeshma తో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న కన్నడ బ్యూటీ Rashmika ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలతో బిజీగా ఉంది. కొన్ని నెలల క్రితమే Allu Arjun Pushpa సినిమా సైన్ చేసిన ఈ బ్యూటీ తాజాగా Sharwanand 'Aadallu Meku Joharlu' (#AMJ) కూడా సైన్ చేసి ఓపెనింగ్ కు కూడా వెళ్లింది

వచ్చే నెల నుండి Pushpa షూట్ లో పాల్గొనబోతున్న రష్మిక వచ్చే ఏడాది మార్చ్ నుండి శర్వానంద్ సినిమాకి షిఫ్ట్ అవుతుంది. ఆడాళ్ళు మీకు జోహార్లు సెట్స్ పైకి వచ్చేలోపు పుష్ప కి సంబంధించి ఓ భారీ షెడ్యుల్ పూర్తవుతుంది. ఇలా ఒక సినిమా షెడ్యుల్ తర్వాత మరో సినిమా షెడ్యుల్ ప్లాన్ చేసుకుంటుంది రష్మిక.

ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఓ కొలిక్కి వచ్చాక మిగతా సినిమాల గురించి ఆలోచిస్తుందట రష్మిక. అంటే.. రష్మిక బిజీ అయిపోయినట్టే.