Rashmika promotes Middle Class Melodies

Wednesday,November 11,2020 - 03:59 by Z_CLU

ఊహించని విధంగా Middle Class Melodies సినిమా కోసం హీరోయిన్ రష్మిక రంగంలోకి దిగింది. విజయ్ దేవరకొండతో కలిసి ఈ సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేసిన ఈ కన్నడ బ్యూటీ.. సినిమాను మెచ్చుకుంటూ బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ పెడుతోంది.

middle class melodies rashmika

నిజానికి ఓటీటీ రిలీజ్ కంటే ముందే ఈ సినిమా చూసింది రష్మిక. విజయ్ దేవరకొండ, రష్మిక స్పెషల్ గా ఈ మూవీ చూశారు. సినిమా బాగా నచ్చడంతో రష్మిక, సొంతంగా ప్రమోషన్ షురూ చేసింది.

https://www.youtube.com/watch?v=P2_890jLOyU&feature=emb_logo

ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను వినోజ్ అనంతోజు డైరక్ట్ చేశాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనందప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్రయిలర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం దీనికి 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.