Rashmika in Akhil-Surender Reddy Movie

Tuesday,October 13,2020 - 04:40 by Z_CLU

త్వరలోనే సురేందర్ రెడ్డి డైరక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు అఖిల్. లేటెస్ట్ గా ఈ సినిమాకు హీరోయిన్ ను లాక్ చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మికను ఈ ప్రాజెక్టులోకి తీసుకుంటున్నారు. దాదాపు డిస్కషన్స్ పూర్తయ్యాయి.

Akhil-Rashmika కాంబినేషన్ లో ఇదే ఫస్ట్ మూవీ. ఇంతకుముందు నాగార్జున "దేవదాస్" సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఆమె నటించబోతున్న రెండో అక్కినేని హీరో Akhil Akkineni

రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేశాడు సురేందర్ రెడ్డి. టీమ్ అంతా కలిసి కూర్గ్ వెళ్లి మరీ బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసింది. ఇదొక స్పై థ్రిల్లర్.

ఈ మూవీతో సురేందర్ రెడ్డి నిర్మాతగా కూడా మారుతున్నాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి ప్రొడ్యూస్ చేస్తాడు. డిసెంబర్ నుంచి మూవీ సెట్స్ పైకి వెళ్తుంది.

Also Check - Rashmika New Stills